స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి రోజుకో కొత్త హంగులతో ప్రేక్షకులను అలరిస్తూ మైమరిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సూపర్ మోడల్ కైనా మతి చెడేలా అదిరే ఫ్యాషన్ తో అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు హీరోయిన్స్ ని మించిన అందంతో ఎక్స్పోజ్ చేస్తూ కుర్రకారుల మతి పోగొట్టేలా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే షేడెడ్ కలర్ చీరకు కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్ ,చెవికి క్రిస్టల్ లైన్, జూకా ధరించి చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది అల్లు స్నేహ రెడ్డి.. ఇంకా చెప్పాలంటే సూపర్ మోడల్ ని తలపిస్తోందని చెప్పవచ్చు.
ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీల భార్యల విషయానికి వస్తే అందులో స్నేహారెడ్డి ముందుంటుంది.. ఎప్పుడూ కూడా తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను , వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మార్కెట్లో ఏదైనా కొత్త డిజైన్ డ్రెస్ వచ్చిందంటే ఆ డ్రెస్ లో తలుక్కుమని మెరుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.
ఇక చీరకట్టులో మనోహరంగా కనిపిస్తోంది ..కవ్విస్తోంది అంటూ కాంప్లిమెంట్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ డిజైనర్ సారీ ని సమంతకు ఎంతో ఇష్టమైన స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ డిజైన్ చేశారు. సాటిన్ చీర.. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ స్నేహ కోసం చాలా చక్కగా తయారు చేశారు ప్రీతం జుకాల్కర్. ఇకపోతే ఆ భుజంపై పాకి ఉన్న ఆ నక్షత్ర చేప టెంటకిల్స్ డిజైన్ ఆలోచన ఎలా వచ్చిందో అంటూ అతడిని ప్రశంసలతో మెచ్చుకుంటున్నారు. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈమె ధరించిన కాస్ట్యూమ్ ధర 80 లక్షల రూపాయలు. ఇక ఈ ఫోటోలను షేర్ చేయగానే అందరూ కూడా ఈమెను స్టైలిష్ స్టార్ రాణి అని పిలుస్తున్నారు. ఈమె అందాన్ని చూసి అల్లు అర్జున్ అభిమానులు స్నేహ రెడ్డి హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నారు.