Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..”సలార్” రిలీజ్ డేట్ ఫిక్స్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయో అప్డేట్‌ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ బిగ్‌ అప్డేట్‌ వదిలింది చిత్ర బృందం.ఈ సలార్‌ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023, సెప్టెంబర్‌ 28 వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు ప్రశాంత్‌ నీల్‌. ఈ మేరకు ప్రభాస్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇక అప్డేట్‌ తో ప్ర భాస్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news