- గులాబ్ తుఫాను కారణంగా ఏపీనే కాకుండా తెలంగాణ ఒడిశా, చత్తీస్గడ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉద్రుతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు భారీగా చేరుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదమే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నాందేడ్-నాగ్ పూర్ హైవేపై వరద తీవ్రత పెరిగింది. 7-8గురు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భారీ వరదలో కోట్టుకుపోయింది. వరదను అంచనా వేయకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం ప్రయాణికుల్లో ఒకరి డెడ్ బాడీని గుర్తించగా, మరో ఇద్దరు కోట్టుకుపోగా, మరో 4గురిని స్థానికులు రక్షించారు. యావత్మల్ జిల్లా పరిధిలో ఉమర్ ఖేడ్-పూసద్ మధ్యలో దహేగామ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. లోలెల్ బ్రిడ్జిని దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన బస్సు నాగ్ పూర్ డిపోకు చెందినది.
వరదలో కొట్టుకుపోయిన బస్సు.. మహారాష్ట్రలో ఘటన
-