స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు 30% పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

-

స్థానిక ప్రజా ప్రతినిధులకు శుభ వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ జీతాలను పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలను 30 శాతం వరకు పెంచేసింది తెలంగాణ ప్రభుత్వం. జెడ్పిటిసి మరియు ఎంపీపీ ల గౌరవ వేతనాన్ని రూ. 13 వేలకు పెంచింది సర్కార్. అలాగే  ఎంపిటిసి మరియు సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని రూ. 6500 కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని… ఈ నేపథ్యంలోనే వారి జీతాలు పెంచుతారు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. “స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న గౌరవ సీఎం గారి హామీ మేరకు ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు 30% గౌరవ వేతనం పెంపు ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం.” అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news