మనలో టాలెంట్ ఉండాలని కానీ..వ్యాపారం చేయడానికి ఏజ్ తో అనుభవంతో సంబంధం లేదు. ఎందుకుపనికిరాని వాటితో కూడా అందమైన ఆకృతులు చేస్తూ.. నేటి యువత లక్షలు గడిస్తున్నారు.. తాజాగా…మునగతో సౌందర్య ఉత్పత్తులు చేస్తూ.. 26 ఏళ్ల దీపికారవి కోట్లల్లో వ్యాపారం చేస్తుంది. ఈమె కథ ఎంతో మందికి ఆదర్శం..మీరు ఓ లుక్కేయండి.!
తమిళనాడుకు చెందిన దీపక కరూరులో ఉంటారు.. తండ్రి రవివేలు సామితో కలిసి పొలానికి వెళ్తూ ప్రకృతిపై ఆసక్తిని పెంచుకుంది. తమ జిల్లాలో అత్యధికంగా దిగుబడిచ్చే వాటిలో ఒకటైన మునక్కాయల విక్రయంలో తండ్రి ఎదుర్కొనే సవాళ్లను కళ్లారా చూసింది.. పండిన పంట విక్రయించడానికి సరిపడా మార్కెట్ ఉండేది కాదు. దాంతో కొంత పంట వృథా అయ్యేది. కేవలం కాయలే కాకుండా ఈ చెట్టులోని ఇతర భాగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దీపికకు కాస్త అవగాహన ఉంది.ఇంకా వాటిపై మరింత అధ్యయనం చేసింది. వీటితో సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేయొచ్చనే ఆలోచన వచ్చింది. అలా ‘గుడ్ లీఫ్’ స్టార్టప్ 2017లో మొదలైంది.
మునగ కల్పవృక్షం లాంటిది. పెంచడమూ తేలికే. వాతావరణం అనుకూలిస్తే చాలు. దిగుబడి బాగుంటుంది. ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్ తదితర ఖనిజలవణాలు వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి.. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నిండుగా ఉండటంతో చర్మ సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయులను సమన్వయం చేసే ఔషధ గుణాలు వీటిలో ఎక్కువ.
అలా మొదలైంది..
దీపిక.. మొదట తన మా పొలంలో పెంచుతూనే, చుట్టు పక్కల వ్యవసాయదారులని కూడా సంప్రదించి… వారు పెంచుతున్న మునగ చెట్ల నుంచి ఆకులు, పూల దిగుబడిని వినియోగించుకుంటూ ఉత్పత్తుల తయారీని ప్రారంభించినట్లు పేర్కొంది… ఈ చెట్ల పెంపకమంతా సేంద్రియ పద్ధతిలోనే ఉండటంతో ఉత్పత్తుల్లో కూడా నాణ్యత ఉండేది..అలా ఈ నాలుగేళ్లలో కరూర్ సహా దిండిగల్, తేని, వేలూరు తదితర జిల్లాల్లో 200 మంది రైతులు మాతో కలిసి పని చేస్తున్నారు. మొదట ముఖానికి, ఒంటికి, శిరోజాలకు ఉపయోగించడానికి పొడులు, క్యాప్సుల్స్, ఫేస్‌ప్యాక్‌ల తయారీ చేపట్టారట… ఎంతో అధ్యయనం, ప్రయోగాల తర్వాత ఇది సాధించగలిగినట్లు దీపక తెలిపింది.
వీటితోపాటు రైస్ మిక్స్, చట్నీ పౌడర్, టీపౌడర్ వంటివీ ప్రారంభించారట.. మునగాకు హెయిర్ ఆయిల్, సీరం వంటివి కూడా అందిస్తున్నట్లు దీపక పేర్కొంది.. వాళ్ల వెబ్సైట్ ద్వారా రాష్ట్రేతర ప్రాంతాల వినియోగదారులకూ వీటిని అందించగలుగుతున్నారట… నాలుగేళ్లలోనే కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకోగలిగినందుకు తన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది..త్వరలో మునగాకుతో ఫేస్ క్రీం, ఫేస్‌వాష్ వంటివీ విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించింది.
-Triveni Buskarowthu