బిజినెస్ ఐడియా: ఈ వ్యాపారంతో రూ.2 నుంచి 6 లక్షల వరకు ఆదాయం..!

-

చాలా మంది ఈ మధ్య కాలంలో వ్యాపారాలని చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా ని చూడండి. ఈ వ్యాపారం ద్వారా నెలకు రెండు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తుంది మరి ఇక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

మీరు అమూల్ ఫ్రాంచైజీని తీసుకుంటే అదిరే లాభాలని పొందవచ్చు. ఈ వ్యాపారం కోసం కనీసం 2 నుండి 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. ఈ బిజినెస్ కోసం అమూల్ ఫ్రాంచైజీని తీసుకోవాలంటే ముందుగా అమూల్ డెయిరీని సంప్రదించాలి.

అప్పుడు మీరు కూడా అమూల్ అవుట్‌లెట్‌ను ఓపెన్ చేసేయచ్చు. దీని కోసం స్థలం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. రూ.25,000 సెక్యూరిటీ మనీగా  పే చెయ్యాల్సి వుంది. తరవాత ప్రోడక్ట్స్ కోసం డబ్బులు పెట్టాలి. మీకు ప్రోడక్ట్స్ ని బట్టీ కమీషన్ వస్తుంది.

ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేస్తే నెల నెలా రూ.లక్ష వరకు కమీషన్ పొందవచ్చు. ఫ్రాంచైజీని తెరవడానికి మీరు ఈమెయిల్ లో దరఖాస్తు చేసుకోవాలి. అమూల్ వెబ్ సైట్ లో పూర్తి సమాచారం ఉంటుంది. చూసి తెలుసుకోవచ్చు. మంచిగా వ్యాపారం చేస్తే అమూల్ ప్రోడక్ట్స్ ద్వారా రూ.2 నుంచి 6 లక్షల వరకు ఆదాయం కూడా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news