మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా..? ఆ వ్యాపారం తో మంచిగా సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ ఐడియాస్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా రాబడి బాగుంటుంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగాలని కోల్పోతామని వ్యాపారం మొదలుపెట్టారు.
నిజానికి లాక్ డౌన్ చాలా ఇబ్బందులు తెచ్చి పెట్టింది. చాలామంది ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారిపోయింది. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఒక అతను చేసిన ఈ బిజినెస్ ఐడియా ని చూస్తే మీరు కూడా అనుసరిస్తారు. ఎందుకంటే లాభాలు లక్షల్లో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఉన్న ఉపాధి మార్గం పోతే ఎలా అని అనుకున్నాడు. దీనితో రెండు ఎకరాల భూమి లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను సాగు చేయాలని అనుకున్నాడు.
అతనికి ఎలాంటి అనుభవం లేదు కానీ ఆన్ లైన్ లో వర్క్ షాప్ కి అటెండ్ అయ్యి.. స్ట్రాబెర్రీలను పండిస్తున్న రైతులను కలిసి సాగు మెలకువలు తెలుసుకున్నాడు. వారణాసి లో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు స్ట్రాబెరీలకి అనుకూలంగా ఉంటుందని డ్రిప్ ఇరిగేషన్ తో పాటు నీటి సంరక్షణ పద్ధతులు కూడా పాటించాడు.
ఒక మొక్క నుంచి సగటున 5 వందల గ్రాముల పండ్లు దిగుబడి ఇప్పుడు వస్తుంది. రెండెకరాల లో 15 వేల మొక్కలు పెంచుతున్నాడు. కిలో స్ట్రాబెరీ సగటున 200 కి అమ్ముడవుతోంది. ఒకసారి పంట చేతికి వచ్చి అమ్ముడుపోతే 5 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
అంటే నెలవారి ఆదాయం లక్షకుపైగా గానే ఉంటుంది కదా.. ఇలా ఆర్గానిక్ స్ట్రాబెరీలను పండించి లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ విధంగా అనుసరిస్తే ఖచ్చితంగా మంచి రాబడి వస్తుంది పైగా ఈ వ్యాపారం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. టెక్నీక్స్ ని ఇతనిలా తెలుసుకుని అనుసరిస్తే చక్కటి లాభాలు ఉంటాయి.