ఉద్యోగాలు చేసేకంటే..ఏదో ఒక చిన్న వ్యాపారం చేయడమే ఈరోజుల్లో మంచిదని చాలామంది అనుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే..లక్షల్లో పెట్టుబడి..వందల సంఖ్యలో పనివాళ్లు కావాలనుకుంటారేమో…పది వేలు ఉన్నా బిజినెస్ స్టాట్ చేయొచ్చు. మన దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉంటే చాలు. అలాంటి చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాం. మీకు అరటి కాండం గురించి వినే ఉంటాం. అరటి పంట వేసిన వాళ్లు ఇది కట్ చేసి పడేస్తారు. దీంతో ఏం ఉపయోగం ఉండదనుకుని వృథాగా వేస్తారు. అయితే ఈ అరటి కాండం మీ ఆదాయ వనరుగా మారితే మాత్రం మంచి డబ్బులు అర్జించవచ్చు. ఎలా అంటారా..?
అరటి పంటలు పండించే రైతులు సాధారణంగా దాని కాండం పారవేస్తారు. ఇది పర్యావరణం, నేల రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో నేల సారం తగ్గుతుంది. కానీ ఈ కాండంను సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు.. దీని కోసం మీరు ఒక గొయ్యిని తవ్వాలి. అందులో అరటి కాండం వేయాలి. ఆ తర్వాత ఆవు పేడ, కలుపు మొక్కలను కాండంతోపాటు గుంతలో వేయాలి.. దీనితో పాటు డీకంపోజర్ కూడా స్ప్రే చేస్తారు. ఈ కాండం ఇతర పదార్థం సేంద్రీయ ఎరువుగా కుళ్ళిపోతుంది. దీనిని రైతులు తమ పొలాల్లో పంటలు పండించడానికి ఉపయోగించవచ్చు.
మీరు దానిని మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. సేంద్రియ ఎరువు తయారీకి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అందువల్ల, దీని నుండి సంపాదన, నికర లాభం దాదాపు ఒకే విధంగా ఉంటుంది.
సేంద్రియ ఎరువులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువు వాడేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి..సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల నేల యొక్క సారవంతమైన శక్తిని కాపాడుకోవడమే కాకుండా, రసాయన రహిత కూరగాయలు, ధాన్యాలు వాడటం ఆరోగ్యానికి కూడా మంచిది.