టీవీ కొంటె ఫాస్ట్ గా కొనుక్కోండి… అర్జెంట్ గా…!

గతంలో టీవీ కొనాలి అంటే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. దేశంలో ఎక్కడ అయినా సరే టీవీ ధర కనీసం 10 వేలకు పైగానే ఉండే పరిస్థితులు ఉండేవి. అయితే చైనా కంపెనీలు టీవీ ల పరిశ్రమ లోకి అడుగు పెట్టిన నేపధ్యంలో కాస్త టీవీ ధరలు తగ్గాయి అనే చెప్పాలి. ఇప్పుడు 15 వేల 40 ఇంచ్ ల టీవీ కొనే పరిస్థితి ఉంది. అయితే ఇక నుంచి టీవీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు.

ఇప్పటి వరకు టీవీ లను స్వేచ్చగా దిగుమతి చేసుకున్నారు. కాని… నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చామని… డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (DGFT) విభాగం వెల్లడించింది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో చైనా నుంచి వచ్చే వాటిపై భారత ప్రభుత్వం కాస్త నిబంధనలు కఠినం చేస్తుంది. ఇతర దేశాల నుంచి టీవీ లు దిగుమతి చేసుకోవాలి అంటే… కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని DGFT నుంచి లైసెన్స్‌ పొందాలి.