వాగులో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే.. కాపాడిన యువకులు..!

-

ఉత్తరాఖండ్ లో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ వాగులు, వంకలు తీవ్రంగా పొంగిపొర్లుతున్నాయి. అయితే ఓ వాగును ఎమ్మెల్యే హరీశ్ దాటుతుండగా ఒక్కసారిగా జారి పడిపోయారు. అనంతరం అతడు నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన సిబ్బంది వెంటనే అతడిని రక్షించారు. ఆయనను పార్టీ కార్యకర్తలు రక్షిస్తుండగా తీసిన వీడియో మీడియాకు దొరికింది.

వాగులో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరగడంతో ఎమ్మెల్యే హరీశ్ పడిపోయారని అక్కడి వారు చెప్పారు. ఆ నీరంతా చెత్తతో నిండి ఉందని చెప్పారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే హరీశ్‌కు స్వల్పగాయాలయ్యాయని వివరించారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news