కరోనా కు చెక్ : భారత్ నుండి మరో వ్యాక్సిన్…! రంగంలో దిగిన కడిలా హెల్త్‌కేర్..!

-

covid vaccine
covid vaccine

భారత్ ను కరోనా మహమ్మారి కలవర పెడుతుంది. ప్రతీ రోజు వేల సంఖ్య లో విస్తరిస్తూ వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తుంది. వైరస్ విజృంభణ ఏ స్థాయిలో జరుగుతుందో అదే స్థాయిలో వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈపాటికే హైదరబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటిక్ సంస్థ ‘కొవాగ్జిన్’ పేరిట ఓ ఔషధాన్ని తయారు చేసి నేడో రేపో మనుషుల పై ట్రయల్స్ చేసేందుకు సిద్ధంగా ఉంది. జంతువుల పై చేసిన పరీక్షల్లో సత్ఫలితాలు చూపిన ఈ మెడిసిన్ కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే స్థాయిలో భార‌త్‌కు చెందిన‌ మరో కంపెనీకి డీసీజీఐ అనుమ‌తినిచ్చింది. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన జైడ‌స్ కాడిలా హెల్త్‌కేర్ రూపొందించిన వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమ‌తి లభించింది.

వివరాల్లోకి వెళితే… గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన జైడ‌స్ కాడిలా హెల్త్‌కేర్ రూపొందించిన వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమ‌తి లభించింది. కాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన మెడిసిన్ ను ఈపాటికే జంతువులపై పరీక్షించారు. ఆ ట్రయల్స్ లో ఈ మెడిసిన్ మెరుగైనా రిజల్ట్స్ ను చూపించింది. జంతువుల పై రెండు స్టేజ్ లలో ట్రయల్స్ జరిగాయి. రెండు ట్రయల్ లో భద్రత, రోగనిరోధక శక్తి అంశంలో ఈ మెడిసిన్ విజయవంతమైనట్టు తేలింది. దీంతో డీసీజీఐ ఈ సంస్థ కు మనుషుల పై ట్రయల్స్ చేసుకునేందుకు అనుమతులని ఇచ్చింది. అనుమతులతో త్వరలోనే జైడిస్ కాడిలా మనుషులపై ప్రయోగాలు ప్రారంభించనుంది. మొదటి, రెండు దశలు పూర్తికావడానికి మూడు నెలల సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రెండు స్టేజ్ లలో ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా రెండు స్టేజ్ లలో సత్ఫలితాలు చూపగలిగితే భారత్ నుండి కరోనా కు వ్యాక్సిన్ రావడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news