స్మార్ట్ ఫోన్లలో మనం అవతలి వారితో కాల్స్ మాట్లాడే సమయంలో కొన్ని సార్లు మనల్ని నెట్‌వర్క్ ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇంట్లో ఉంటే సిగ్నల్ సరిగ్గా రాదు. దీంతో బయటకు వెళ్లి ఫోన్ కాల్స్ మాట్లాడుతాం. అయితే ఇలా చేసినా కూడా వాయిస్ స్పష్టంగా వినిపించడం లేదు, అంటే.. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి.
* స్మార్ట్ ఫోన్లకు చెందిన మైక్రోఫోన్లు లేదా స్పీకర్లలో దుమ్ము, ధూళి పేరుకుపోతుంటాయి. దీని వల్ల కూడా కొన్ని సార్లు మనకు కాల్స్‌లో అవతలి వారి గొంతు సరిగ్గా వినిపించదు. ఇందుకు గాను అత్యంత సన్నవైన అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్‌తో ఫోన్ మైక్, స్పీకర్‌లను శుభ్రం చేయాలి. దీంతో సమస్య పరిష్కారమవుతుంది.
* కొన్ని కంపెనీలకు చెందిన ఫోన్లలో హెచ్‌డీ కాలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేస్తే హెచ్‌డీ కాల్స్ చేసుకోవచ్చు. మనం మాట్లాడేది హెచ్‌డీ కాల్ అయితే కాల్ చేస్తున్న సమయంలో డయలింగ్ ప్రాంతంలో హెచ్‌డీ అని కనిపిస్తుంది. దీంతో హెచ్‌డీ కాల్ ద్వారా స్పష్టంగా కాల్స్ చేసుకోవచ్చు.
* ప్రస్తుతం అనేక ఫోన్లలో వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇంట్లో కాల్‌కు సిగ్నల్ లేకపోయినా వైఫై కాలింగ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో మనం మాట్లాడే కాల్స్ స్పష్టంగా వినిపిస్తాయి.
పైన మూడు విధానాలను పాటించినా సమస్య పరిష్కారం కాకుండా ఏదైనా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఇంతకు మించిన ఉత్తమమైన పద్ధతి ఇంకొకటి లేదు. వాటిలో కాల్స్ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు.