తెలంగాణలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవి టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామ శివారులో చిరుతలు కలకలం రేపాయి. కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. అయితే నిన్న గత రాత్రి కామారం గ్రామ సమీపంలో మామిడి తోట వద్ద మూడు చిరుత పులి పిల్లలు రోడ్డుపై బైఠాయించినట్టు చెబుతున్నారు.
అటుగా వచ్చిన ఆటో వెంబడి పరిగెత్తడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్టు చెబుతున్నారు. అంతే కాదు అటవీ శాఖ అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పటించుకోడం లేదు అని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. గ్రామంలో టపాకాయలు కాల్చి మంటలతో చిరుతలను తరిమి వేశామని గ్రామస్తులు అంటున్నారు. చిరుత పులుల బాద నుండి తమను కాపాడాలని కామారం గ్రామస్తులు వేడుకుంటున్నారు.