గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ పదిరోజులకే పాడవుతుందా..? కారణం ఇదే..!

-

ఇంటికి గుమ్మడికాయ కట్టడం ఇండియాలో ఎప్పటినుంచో పాటిస్తున్న పద్దతే. నరదిష్టి తగలకుండా కడుతుంటారు. గుమ్మడిలో రెండు ఉంటాయి. ఒకటి తినేది.. ఒకటి ఇలా ఇంటికి కట్టేది. అసలు ఈ బూడిద గుమ్మడికాయను ఎలా కట్టాలి, కడితే ఏం జరుగుతుందో చూద్దాం.. దీంతోపాటు.. కొందరి ఇళ్లకు కట్టిన బూడిద గుమ్మడికాయ పదిరోజులకే పాడవుతుంది. ఇలా జరగడం దేనికి సంకేతమో కూడా తెలుసుకుందాం.!
ముఖ్యంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టేది నరదృష్టి, నరఘోష మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం. ఈ గుమ్మడి కాయలను మంగళవారం లేదా శనివారం రోజున సాయంత్రం సమయంలో లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి, బొట్లు పెట్టి, హారతి ఇచ్చి అప్పుడు దాన్ని కడితే చాలా మంచిదని పండితులు అంటారు.. అది కూడా ఇంటి ముందు ప్రత్యేకమైన స్థలంలో మాత్రమే కట్టాలి. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి.
అలా కనిపిస్తే.. వారి కంటిచూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్‌ ఎనర్జీ అంతా పోతుంది. అయితే కొంత మంది కట్టిన వారం, పది రోజులకే గుమ్మడికాయ పాడవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువగా ఉంటే మాత్రమే గుమ్మడికాయ త్వరగా పాడవుతుందని పండితులు అంటున్నారు.. అలా గుమ్మడికాయ పాడైన వెంటనే దాన్ని తీసివేసి కొత్తది కట్టేయాలి. ఎప్పుడూ కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు. చాలామంది.. షాపుల్లో పాడైన గుమ్మడికాయను అలానే ఉంచుతారు. వారికి అది తీసేంత టైం ఉండదు. అసలు ఉన్నట్లు కూడా ఎదుటివారికి కనిపించదు. గుమ్మడికాయ కట్టడంలో మెయిన్‌ పాయింట్.. వచ్చేవారికి ఫస్ట్‌ అదే కనిపించాలి.. కాయ ఫ్రష్‌గా ఉండి పసుపుతో ఉన్నప్పుడే వారి లుక్‌ దానిపై పడుతుంది. లేదంటో ఎవరూ దేకరు.!
అయితే కాయ పాడవడానికి రెండో రీజన్‌ కూడా ఉంటుంది. మనం కట్టేప్పుడే అది కాస్త అటుఇటుగా ఉంటే.. కట్టిన కొద్దిరోజులకే పాడవుతుంది. ఏది ఏమైనా.. గుమ్మడికాయ పాడైతే అదేదో చెడు, దోషం అని కంగారుపడకుండా.. తీసేసి మళ్లీ ఫ్రష్‌గా కొత్త కాయ కట్టండి.! దీన్నిబట్టి మీ పై మీ ఇంటిపై ఎంతమంది చెడు దృష్టి ఉందో అర్థంచేసుకోండి అంతే..!

Read more RELATED
Recommended to you

Latest news