రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్ : భట్టి విక్రమార్క

-

రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్ ఏర్పాటు చేస్తున్నట్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో జూన్ 1, 2 తేదీల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఆరు గ్రూపులను ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్‌లో చర్చించిన అంశాలను రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగం బలోపేతం, సామాజిక సమస్యలపై చర్చ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యత్యాసాలు, సామాజిక అసమానతలపై ఉక్కుపాదం మోపాలన్నారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ ఇచ్చిందో.. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటిపై చర్చ ఉంటుందన్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి చేస్తున్న ఆరోపణపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని అనడానికి ఆధారాలు చూపించాలన్నారు. ఆధారాలు బయటపెట్టకుండా ప్రభుత్వం నిద్రపోతుందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ కోసం చింతన్ శిబిర్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అంతిమంగా క్రోడికరించి కాంగ్రెస్ పార్టీ కొత్త పాలసీని తయారు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news