రైలు టికెట్‌ను మరొకరికి బదిలీ చేయవచ్చా..? రైల్వే రూల్స్‌ ఎలా ఉన్నాయంటే

-

రైల్వే టికెట్ బదిలీ నియమాలు

భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. రైలు టికెట్‌ అంటే ఎవరైనా కొన్ని నెలలు, రోజుల ముందే బుక్‌ చేసుకుంటారు. కానీ తీరా జర్నీ టైమ్‌ వచ్చేసరికి.. వెళ్లడం కుదరకపోవచ్చు, ప్రోగ్రామ్‌ పోస్ట్‌పోన్‌ కావొచ్చు. అలాగే మీరు వెళ్లాల్సిన టికెట్‌ మీద వేరే వాళ్లు ప్రయాణించాల్సి వస్తే.. మనం మళ్లీ కొత్త టికెట్‌ తీసుకుంటాం. ఒకరి టికెట్‌ మీద వేరొకరు ప్రయాణించడం తప్పు, కానీ ఒకరి టికెట్‌ను వేరొకరికి బదిలీ చేయొచ్చు తెలుసా..? ఇదెలా అనుకుంటున్నారా..?

టికెట్ బదిలీ నియమాలు

అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ప్రయాణీకులు తమ టిక్కెట్లను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య వంటి కుటుంబ సభ్యులకు బదిలీ చేయవచ్చు. ఎవరైనా వివాహం లేదా మరేదైనా వ్యక్తిగత పని కోసం ప్రయాణించవలసి వస్తే, అతను 48 గంటల ముందుగానే టికెట్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా టికెట్ ప్రింట్ ఔట్ తీసుకోండి. ఇప్పుడు మీరు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్‌కు వెళ్లాలి.

ఇక్కడ మీరు ఎవరి పేరు మీద టికెట్ మార్చుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ID కార్డ్‌ని కూడా తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు కౌంటర్ నుండి టికెట్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రైళ్లలో ప్రయాణిస్తాం కానీ.. రైల్వే రూల్స్‌ గురించి చాలా మందికి తెలియదు. ఇలాంటి రూల్స్‌ ఇంకా ఎన్నో ఉంటాయి. ఒకరి టికెట్‌ మీద వేరొకరు ప్రయాణించడం చట్టరీత్యా నేరం. దొరికితే పది వేల వరకూ ఫైన్‌ పడొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా చేయాల్సి వస్తే.. ఆ టికెట్‌ను ఇలా బదిలీ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news