కేసీఆర్ ఎంత దోచుకున్నారో.. అంత డబ్బును పేదల అకౌంట్లో వేస్తాం : రాహుల్ గాంధీ

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత దోచుకున్నారో.. అంత డబ్బును పేదల అకౌంట్లో వేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇవాళ పినపాకలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు చదివిన స్కూల్.. నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిందేనని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో నేనే స్వయంగా వెళ్లి పరిశీలించానని తెలిపారు.

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నేను చెబుతాను కేసీఆర్ అని పేర్కొన్నారు. పదేళ్ల తెలంగాణను దోచుకున్నారు. దానికి అంతం పలికే రోజు దగ్గరికీ వచ్చిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తామని తెలిపారు. ప్రతీ నెల మహిళలకు రూ.2,500 అందజేస్తామని.. మహిళలకు బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యాస్ రూ.500కే అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ మాదిరిగా ఉత్తుత్తి మాటలు కావు.. కాంగ్రెస్ చెబితే చేస్తుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news