కోట్ల మంది వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే ఈ వాట్సాప్ లో చాల ఫీచర్స్ వున్నాయి. మీరు ఏదైనా చాట్ ని సీక్రెట్ గా ఉంచాలంటే కూడా అవుతుంది. అప్పుడు ఎవరు కూడా చాటింగ్ చదవకుండా మీరు సీక్రెట్ గా ఉంచుకోవచ్చు. ఇది చాలా సురక్షితంగా ఉంటుంది.
అదే విధంగా మాన్యువల్ గా కూడా ఆ చాట్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. సులువుగా డిలేట్ చేయడానికి Disappearing messages కూడా వచ్చింది. కానీ ఇప్పటికి కూడా చాలా మందికి దీని యొక్క లాభం తెలియదు. కంపెనీ చెప్పిన దాని ప్రకారం మెసేజ్లు ఆటోమెటిక్ గా డిలీట్ అయిపోతాయి.
వారం రోజుల తర్వాత Disappearing messages ఫీచర్ పెట్టుకోవడం వల్ల పూర్తిగా మెసేజ్లు అన్ని డిలీట్ అయిపోతాయి. మెసేజ్ దగ్గర టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైం బట్టి మెసేజ్లు డిలీట్ అయిపోతాయి.
ఈ ఫీచర్ ని ఆక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు మొదట చాట్ ఓపెన్ చేసి ఎవరు మెసేజ్ దగ్గర అయితే ఆటోమేటిక్ డిలీట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లది సెలెక్ట్ చేసి ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు అక్కడ Disappearing messages అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ కూడా ఇచ్చింది. దీనివల్ల ఎవరు మీ చాట్ ని చదవకుండా ఉంచచ్చు.