ధరణి పోర్టల్ ఫిర్యాదులకు వాట్సాప్ నెంబర్..

ధరణి పోర్టల్… భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న ఆవిష్కరణ ధరణీ పోర్టల్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, త్వరితగతిన పరిష్కారాలు చూపడానికి, భూముల వివరాలు పొందడానికి ధరణి పోర్టల్ ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా భూముల వివరాలన్నీ ధరణి పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. ఐతే తాజాగా ధరణి పోర్టల్ కి వచ్చే ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ ని కేటాయించారు.

ఫిర్యాదులు ఇచ్చేందుకు వాట్సాప్ ద్వారా ఒక నంబరును విడుదల చేసారు. 9133089444 నంబరుకు మీ ఫిర్యాదును వాట్సాప్ చేయవచ్చు. భూముల వివరాల్లో గానీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫిర్యాదులతో పాటు భూముల వివరాల్లోని సమస్యలను సులభంగా పై అధికారులకు చేరవేయడానికి వాట్సాప్ నంబరును విడుదల చేసింది. దీన్ని ఉపయోగించి ధరణి పోర్టల్ ఫిర్యాదులను పంపవచ్చు.