అదిరే LIC పాలసీ.. రూ.252తోనే రూ.20 లక్షలు..!

-

ఈ మధ్య కాలం లో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. దీనితో మంచిగా లాభాలు పొందుతున్నారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పలు పాలసీలను అందిస్తోంది. దీని వలన మంచిగా డబ్బులొస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. చిన్న వయసులోనే ఎల్‌ఐసీల్లో పెట్టుబడులు పెడితే మెచ్యూరిటీ సమయం లో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి.

LIC
LIC

అయితే మరి ఎల్ఐసీ పాలసీలలో ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీలో రోజూ రూ.252 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షలను పొందొచ్చు. పైగా పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. ఇక ఎవరు ఈ పాలసీని తీసుకోవచ్చు అన్నది చూస్తే.. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి.

పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. దీనిని తీసుకోవాలి అంటే కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా పరిమితి అయితే లేదు. నెలవారీ, త్రైమాసికంగా, అర్థ వార్షికంగా, వార్షికంగా ఈ ప్రీమియాల చెల్లింపు చెయ్యచ్చు. ప్రీమియాన్ని 10 నుంచి 16 ఏళ్ల వరకు చెల్లించుకోవచ్చు.

ఇక డబ్బులు ఎంత వస్తాయి అనేది చూస్తే.. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీని కెరీర్ మొదలు పెట్టినప్పుడు తీసుకుంటే బెస్ట్. 23 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి 16 ఏళ్ల కోసం రోజుకు రూ.251.7ను పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షలు వస్తాయి. దీన్ని తీసుకున్న మూడు సంవత్సరాలకి లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news