ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..వారందరికీ ఎలక్ట్రిక్‌ వాహనాలు

-

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. బస్‌ స్టేషన్లలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ బైక్‌లు, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ సర్క్యూలర్‌ ను కూడా జారీ చేసింది. సర్క్యూలర్‌ ప్రకారం… ఆర్టీసీ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ బైక్‌ లను వాయిదాల పద్దతి లో అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో మొత్తం 7 వేల మంది ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఉన్నతాధికారులు కలిసి బస్‌ స్టేషన్లలో సోలార్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు ద్వారా సోలార్‌ విద్యుత్‌ ను అందిస్తామని, ఆవరణలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులకు నాణ్యమైన వాహనాలను అందిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ ఎండీ ఉద్యోగులందరికీ ఎలక్ట్రిక్‌ వాహనాలు అందించటానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయన సర్క్యూలర్‌ ను జారీ చేయడంతో పాటు డిపో మేనేజర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news