స్టేట్ బ్యాంక్ సూపర్ స్కీమ్.. రూ.32 లక్షలు… పూర్తి వివరాలివే..!

-

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. నిజానికి ఇలా డబ్బులని పొదుపు చేస్తే చక్కటి లాభాలని పొందొచ్చు. భవిష్యత్తు లో ఏ సమస్యా కూడా ఉండదు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అలానే ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ని స్టేట్ బ్యాంక్ ఇస్తోంది.

దీనితో చేరితే అదిరే బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఎస్‌బీఐ సర్వోత్తం పేరుతో టర్మ్ డిపాజిట్ సర్వీసెస్ ని ఇస్తోంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. రెండు రకాల ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఒకటి నాన్ క్యాలబుల్. ఇంకోటి క్యాలబుల్. ఇలా రెండు ఆప్షన్లు ఉన్నాయి. నాన్ క్యాలబుల్ ఆప్షన్ ని ఎంచుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది.

ఈ తరహా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.9 శాతం వడ్డీని పొందొచ్చు. అయితే ఇది రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్ కి. అదే రెగ్యులర్ కస్టమర్ల కి అయితే 7.4 శాతం వస్తుంది. ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 7.6 శాతం వడ్డీ వస్తుంది. రెగ్యులర్ కస్టమర్లు అయితే వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ ని పెంచేసింది బ్యాంకు. సీనియర్ సిటిజన్స్‌కు రెండేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌ లోని ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీ వస్తోంది.

అలానే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా వుంది. అమృత్ కలాష్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీ వస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు అయితే 7.1 శాతం వడ్డీ వస్తుంది. సర్వోత్తం ఎఫ్‌డీ స్కీమ్‌లో డబ్బులు పెట్టాలంటే కనీసం రూ. 15 లక్షల నుంచి పెట్టాలి. 15 లక్షలు ఇన్వెస్ట్ చేసారంటే పదేళ్లలో చేతికి రూ. 32 లక్షలు వస్తాయి. దీని టెన్యూర్ 2 ఏళ్లు వరకే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news