కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. చాలా మంది అనేక ప్రయోజనాలను ఈ స్కీమ్స్ ద్వారా పొందుతున్నారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన వాటిలో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరిన సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 4 కోట్ల కి చేరింది. ఇక మరి ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ స్కీమ్ కింద నెల నెలా ప్రభుత్వం రూ.1000 నుంచి రూ.5000 మధ్య లో పెన్షన్ ని పొందుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే అటల్ పెన్షన్ యోజన అకౌంట్ల ఎన్‌రోల్‌మెంట్ల లో సుమారు 80 శాతం మంది సబ్‌స్క్రయిబర్లు రూ.1000 పెన్షన్ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్నారు.
అలానే 13 శాతం మంది రూ.5000 పెన్షన్ ప్లాన్‌ను తీసుకుంటున్నారు. ఈ స్కీమ్ లో చేరడం వలన చక్కగా నెల నెలా పెన్షన్ వస్తుంది. అయితే ఎంత పెన్షన్ వస్తుంది అనేది మీరు చెల్లించే దానిని బట్టి ఉంటుంది. ఈ అకౌంట్లను తీసుకున్న వారిలో 44 శాతం మంది మహిళలు కాగా, 56 శాతం పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. అలానే ఈ స్కీమ్ ని వినియోగించుకుంటున్న వారి లో 45 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల వారే.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు, ఆర్‌ఆర్‌బీలతో కలిసి ఈ స్కీమ్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించాలని చూస్తోంది. ఈ విషయం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ తెలిపింది. బ్యాంకులు మాత్రమే కాక బిహార్, ఝార్ఖాండ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, త్రిపురల లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు కూడా ఈ స్కీమ్ యొక్క లక్ష్యాల్ని చేరుకుంటున్నారు.