ఉక్రెయిన్ పై దాడులను ముమ్మరం చేసింది రష్యా. ఇన్నాళ్లు కీవ్ ప్రాంతాన్ని చేజిక్కిచ్చుకునేందుకు ప్రయత్నించిన రష్యా… ప్రస్తుతం తూర్పు ప్రాంతంపై దాడులు చేస్తోంది. డాన్ బాస్ ప్రాంతంపై దాడులు చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లోని అత్యంత కీలకమైన మరియోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే మరియోపోల్ లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని మాత్రం ఇంకా చేజిక్కించుకోలేదని.. ఉక్కు కర్మాగారాన్ని రష్యన్ సేనలు చుట్టుముట్టాయని రష్యా తెలిపింది. ఈ కర్మాగారంలో 2000 పైగా ఉక్రెయిన్ సైనికులు ఉన్నారని… అందుకే ఉక్కు కర్మాగారాన్ని పేల్చేయలేదని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని రష్యా సూచించింది. లొంగిపోయిన వారికి ఎలాంటి హానీ చేయబోమని హామీ ఇచ్చింది. అయితే కర్మాగారం లోపలికి రష్యా సైనికులను పంపబోమని… అలాగే కర్మాగారాన్ని చుట్టుముట్టిన తర్వాత బయట నుంచి సహాయం అందకపోతే.. కొన్నిరోజుల్లో ఆహార నిల్వలు అయిపోయి ఉక్రెయిన్ సైనికులు బయటకు వస్తారని రష్యా యోచిస్తోంది.
ukraine crisis: రష్యా కీలక ప్రకటన… మరియోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
By Advik
-
Previous article
Next article