గుడ్ న్యూస్.. వారికి రూ.50,000 వరకు లోన్..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం కూడా కేంద్రం ఓ స్కీమ్ ని తీసుకు వచ్చింది. రెండేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం ‘పీఎం స్వనిధి పథకం’ ని తీసుకు వచ్చారు. పూర్తి వివరాలను చూస్తే.. ఈ పథకం కింద వ్యాపారులకు రూ.10,000 లోన్ ఇచ్చింది.

ఈ స్కీమ్ కింద చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు లోన్ ని ఇస్తున్నారు. కరోనా మూలంగా చాలా మంది వ్యాపారాలు నష్ట పోయారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా ఉండటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. 2022 నవంబర్ 18 నాటికి రూ.5,000 కోట్లకు పైగా రుణాలను ఈ స్కీమ్ కింద అందించారు. ఈ లోన్ కోసం దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే రుణం వస్తుంది. పీఎం స్వనిధి పోర్టల్‌ లో రియల్‌టైమ్ డేటా అందుబాటులో ఉంది.

పీఎం స్వనిధి పధకం కింద ఎంత వస్తాయి..?

పీఎం స్వనిధి పధకం కింద మనం మొదటిసాటి రూ.10,000 రుణం ని పొందొచ్చు.
దీన్ని ఏడాదిలో కట్టేస్తే రెండోసారి రూ.20,000 లోన్ తీసుకోవచ్చు.
మూడోసారి రూ.50,000 లోన్ తీసుకోవచ్చు.
వార్షిక వడ్డీ 7 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

పీఎం స్వనిధి పధకం కింద ఎవరు లోన్ తీసుకోవచ్చు…?

వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఈ లోన్ ని పొందొచ్చు.
అలానే ఫుట్‌పాత్ వ్యాపారులు కూడా దీనికి అర్హులు.
కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్మేవారు ఇలా చిన్న వ్యాపారాలు చేసేవారు ఎవరైనా పీఎం స్వనిధి పథకం కింద లోన్ ని పొందే అవకాశం వుంది.

Read more RELATED
Recommended to you

Latest news