ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వారికి బిగ్ రిలీఫ్..!

-

పెన్షన్ ని పెన్షనర్లు పొందాలంటే లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవణ ప్రమాణ పత్రం ని సబ్మిట్ చెయ్యాల్సి వుంది. లేదంటే పెన్షన్ ని పొందేందుకు అవ్వదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి మార్పులు చేస్తూనే వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. పెన్షనర్ల పనిని ఈజీ చెయ్యాలని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకు వచ్చారు.

తాజాగా ఎప్పుడైనా దీన్ని సబ్మిట్ చెయ్యచ్చని డెడ్ లైన్ లేదని అన్నారు. నవంబరు 30లోగా లైఫ్ సర్టిఫికేట్లను సబ్‌మిట్‌ ని పెన్షనర్లు సబ్‌మిట్‌ చేయాల్సి ఉంది. (EPS) 1995 కింద పెన్షన్ పొందుతున్న వారికి ఈ రూల్ మాత్రం వర్తించదు. అయితే ఇది వరకు డాక్యుమెంట్‌ను సబ్‌మిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు అది చెల్లుతుంది అని అన్నారు.

ఆ డేట్ దాటకుండా సర్టిఫికెట్‌ ని సబ్మిట్ చెయ్యాలి. అయితే EPS-95 కింద ఉన్న పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఏమి లేదు. మీరు ఎప్పుడు అయితే లైఫ్‌ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసారో చూసి ఈ సంవత్సరం కూడా అదే తేదీ లోపు దాన్ని సబ్‌మిట్‌ చేయాలి. అలా చేయకపోతే 2023 జనవరి నుంచి పెన్షన్ మీకు రాదు. ఆగిపోతుంది.

లైఫ్ సర్టిఫికెట్ ని ఎలా సబ్మిట్ చేయాలి..?

ఇది వరకైతే ఈపీఎస్‌ (EPS) పెన్షనర్లందరూ నవంబర్ నెలలో లైఫ్‌ సర్టిఫికెట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉండేది. కానీ ఇబ్బంది పడాల్సి వచ్చేదని.. దీని కోసమే ఇప్పుడు డిజిట్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ (DLC)ని తీసుకు వచ్చారు.
మీ మొబైల్ నంబర్ ఆధార్‌ తో లింక్ అవ్వాలి. PPO సంఖ్య, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వంటివి అవసరం.
పెన్షన్‌ డిస్బర్సింగ్‌ బ్యాంక్‌, కామన్ సర్వీస్ సెంటర్ లో సబ్మిట్ చేయచ్చు. లేదంటే ఉమంగ్ యాప్, సమీప ఈపీఎఫ్‌ఓ ​​కార్యాలయం, ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌, పోస్ట్ ఆఫీస్‌ లో అయినా సబ్మిట్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news