వీళ్ళకి కరోనా వస్తే 2 నెలల జీతం ముందుగానే…!

కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. రోజు రోజుకి కోవిడ్ 19 కేసులు పెరిగి పోతున్నాయి. దీంతో చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతోంది అనే చెప్పాలి. వైరస్ కారణంగా వ్యాపారాలు సరిగా జరగడం లేదు కూడా. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

ఒకవేళ కరోనా వస్తే ట్రీట్‌మెంట్ కోసం చాలా ఖర్చు అవుతోంది. ఉద్యోగులకు కరోనా వస్తే.. వారి వేతనం కూడా సరిపోకపోవచ్చు. దీనితో మరెంత ఇబ్బంది వచ్చే అవకాశాలు వున్నాయి. వీటి అన్నింటి గురించి ఆలోచించి ఇక్కడ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ముందుగా వాళ్లకి కష్ట కలగకుండా ఉండాలని శాలరీలు ఆఫర్ చేస్తోంది.

కోవిడ్ 19 సోకిన ఉద్యోగులకు 2 నెలల వేతనాలను అడ్వాన్స్ కింద ఇవ్వడానికి ప్రైవేట్ రంగానికి చెందిన నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ తమ ఉద్యోగులకు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ వేతనాన్ని 6 నుంచి 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి చెల్లించే సదుపాయం కల్పిస్తోంది.

ఉద్యోగులకి కాస్త సాయం దొరుకుతుంది. అంతే కాకుండా కంపెనీ మెడికల్ ఇన్‌ఫ్రా సపోర్ట్ కింద మరో రూ.10 వేలు కూడా అందిస్తోంది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారికి ఈ డబ్బులు అందుతాయి. కంపెనీ ఉద్యోగులకు రూ.4 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తోంది. ఉద్యోగులకు ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్టు చెప్పింది.