లేట్ గా పెళ్లి చేసుకుంటే సెక్స్ ను ఆస్వాదించలేరా..?

-

30 ఏళ్లయినా మీకు పెళ్లి కాలేదా.. అయితే ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ పోరు పెడుతూ ఉండాలే..ముదిరిన బెండకాయలా అయిపోతున్నావ్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి ఆలస్యమైతే శృంగారంపైన ఆసక్తి పోతుంది. లేట్ వయసులో వివాహం చేసుకుంటే పిల్లలు పుట్టరు. ఇలా రకరకాల మాటలు విని ఉంటారు. నిజంగానే పెళ్లి ఆలస్యమైతే శృంగారాన్ని ఆస్వాదించలేరా..? లేట్ వయసులో పెళ్లి చేసుకోవాల్సిన వారికి పిల్లలు పట్టడంలో సమస్య ఎదుర్కొంటారా..? లేట్ వయసులో ఘాటు ప్రేమలో పడి చివరగా నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్లే సరికి సెక్స్ లో ఫెయిల్ అవుతున్నారా..? వీటన్నింటిపై నిపుణులు ఏమంటున్నారంటే..?

ఆలస్యంగా పెళ్లయిన వారిలో చాలా అనుమానాలుంటాయి. శృంగారాన్ని ఆస్వాదించగలమా.. భాగస్వామిని సంతృప్తి పరచగలమా? సెక్స్​ హార్మోన్లు స్పందిస్తాయా? ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనగలమా? అలా ఇలాంటి అపోహలతో సతమతవుతుంటారు. “సాధారణంగా శరీరానికి వృద్ధాప్య దశ వస్తుంది కానీ మనసుకు రాదు. మనసులో సెక్స్​ పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయి. అందుకు సంబంధించిన హార్మోన్​లు కూడా చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. దాని వల్ల ఏ వయసులోనైనా సెక్స్ ​ను చక్కగా ఆస్వాదించొచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు.. వయసులో ఉన్న వారిలా ఎక్కువసేపు, అనేక సార్లు పాల్గొనలేకపోవచ్చు కానీ శృంగారంలో ఎంజాయ్​ చేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మగవాళ్లయితే 70 ఏళ్లు వచ్చినా, 80 ఏళ్లు వచ్చినా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే శృంగారంలో పాల్గొని ఆస్వాదించొచ్చని నిపుణులు అంటున్నారు. సెక్స్ లో ఇంకా ఎంజాయ్ చేయాలంటే సినాఫిల్​ వంటి మాత్రలు వాడొచ్చని సూచించారు. ఆడవాళ్లలో కూడా ఆరోగ్యం చక్కగా ఉంటే ఎంత వయసు పెరిగినా శృంగారంలో థ్రిల్​ పొందవచ్చని చెబుతున్నారు.

నచ్చిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలంటే ఫస్ట్ టైం మగాళ్ల వెన్నులో వణుకు పడుతుంది. ఇన్నాళ్లు కలిసి తిరిగి.. అన్ని విషయాలు పంచుకునే ఎంతో క్లోజ్ గా ఉన్నా.. తీరా సమయం వచ్చాక కంగారు పుడుతుంది. అమ్మాయిని సంతృప్తి పరచగలనా లేదా అన్న అనుమానం, టెన్షన్ తో శృంగారంలో కొందరు అబ్బాయిలు ఫెయిల్ అవుతుంటారు. దీనికి కారణమేంటంటే.. యాంగ్జైటీ డిజార్డర్ . తనని ఇష్టపడుతున్న అమ్మాయిని సెక్స్ లో మెప్పించగలనా? ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చినా.. ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు అంటున్నారు. సెక్స్​ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అంగం స్తంభించదని చెబుతున్నారు.

‘ఎప్పుడైనా శృంగారం చేస్తున్నప్పుడు సందేహం రాగానే.. స్ట్రెస్ హార్మోన్స్​ విడుదలవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్స్​ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, గాబరా. వీటిని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది మనసు పడిన అమ్మాయితో సెక్స్​లో పాల్గొన్నా, ఓ అమ్మాయి మనసు పడినా.. ఇదే జరుగుతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మనసులో ఏమూల కూడా డౌట్ లేకపోతే చక్కగా చేయగలుగుతారని’ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news