టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’ కాగా, ఈ సినిమా స్టోరిని పవన్ కల్యాణ్ కు చెప్పడం కోసం పూరీ జగన్నాథ్ చాలా కష్టాలు పడ్డారట. కొత్త వారికి పవన్ కల్యాణ్ అవకాశాలు ఇస్తారని తెలుసుకున్న పూరీ జగన్నాథ్ ఆయన్ను కలవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘బద్రి’ సినిమాకు ముందే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు స్టార్ డమ్ వచ్చేసింది. కాగా, ‘బద్రి’తో ఇంకా స్టార్ డమ్ పెరిగింది. అందులో ఆయన మేనరిజమ్స్, క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా అడ్వాంటేజే అయ్యాయి. పవన్ కల్యాణ్ కు ‘బద్రి’ స్టోరి చెప్పడం కోసం పూరీ జగన్నాథ్ తనకు తెలిసిన వారి వద్దకు వెళ్లి చాలా ట్రై చేశారట. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వద్ద ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ స్టోరి చెప్పారట. అది విని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని పవన్ కల్యాణ్ కు చెప్పగా, ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు.
అలా పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పూరీ జగన్నాథ్.. అక్కడ పవన్ కల్యాణ్ కు ‘బద్రి’ స్టోరి చెప్పారు. అది విని పవన్ కల్యాణ్ అదేంటి? మీరు ఏదో ఇంట్రెస్టింగ్ , సూసైడ్ పాయింట్ ఉన్న స్టోరి చెప్తారని చెప్పారని పవన్ కల్యాణ్ అడగగా, అది వేరే కథని చెప్పారు పూరీ. అలా పవన్ కల్యాణ్ ను కన్విన్స్ చేసిన పూరీ జగన్నాథ్.. ఆయనతో ‘బద్రి’ సినిమా చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కు ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ..తమిళ అమ్మాయి’, ‘పోకిరి’ కథలు కూడా చెప్పారు. కానీ, అవేవీ ఆయనతో తీయలేదు. ఆ స్టోరిలు విని బాగున్నాయని చెప్పిన పవన్ కల్యాణ్..చేద్దామని మాత్రం అనలేదు. అలా ఆ స్టోరిలు వేరే హీరోల వద్దకు వెళ్లాయి.
అలా తొలి సినిమా పవన్ కల్యాణ్ తో తీసిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్.. పవన్ కల్యాణ్ తో ‘కెెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ పాపులర్ అవుతారని సినీ అభిమానులు అంటున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇందులో బాక్సర్ గా ఇరగదీస్తారని సినీ ప్రియులు చెప్తున్నారు. పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ ఫిల్మ్ కూడా విజయ్ తోనే చేస్తున్నారు.