ఇండియాకు వరల్డ్ కప్ టైటిల్ ను అందించిన రెండవ కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు మహేంద్ర సింగ్ ధోని. కానీ కొంతకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సంవత్సరం చెన్నై కు టైటిల్ ను కూడా అందించి వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాగా తాజాగా ధోనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ధోని ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉండగా మెట్లు దిగడానికి ఇబ్బంది పడుతున్న ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. కేవలం మెట్లు దిగడానికి ఇంతలా ఇబ్బంది పడుతున్న ధోని ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు.
మార్చ్ ఏప్రిల్ లో జరుగనున్న ఐపీఎల్ లో ధోని ఫిట్నెస్ సాధించి చెన్నై ను మరోసారి లీడ్ చేస్తాడా అన్నది చూడాలి. ఇక ఈ న్యూస్ కు ధోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడని కామెంట్ చేస్తున్నారు.