ప్రపంచం మొత్త కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారత్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మొదట్లో వైరస్ ను కట్టడి చేస్తున్నాం అని చెప్పిన నేతలే.. ఇప్పుడు కరోనాతో కలిసి జీవించాల్సిందే అని చెప్తున్నారు. దీంతో మాస్కులు, సానిటైజర్లు మన జీవితంలో ఒక బాగమైపోయాయి.. అవి లేనిదే బయటకి రావట్లేదు ప్రజలు. ప్రభుత్వాలు సైతం మాస్క్ కంపల్సరీ అని తేల్చి చెప్పేసాయి. అయితే ఇప్పుడు తాజాగా.. కెనడా డాక్టర్ ఒకరు మాత్రం మాస్క్ కేవలం బయటకి వెళ్ళేటప్పుడే కాదు.. ఆఖరికి పడక గదిలో శృంగార సమయంలో కూడా మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
సెక్స్ సమయంలో మాస్క్ పక్కాగా ఉండాలని హెచ్చరించారు కెనడాకు చెందిన ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టాం. అలాగే శృంగారం సమయంలో ముద్దులు పెట్టుకోవడం లాంటివి మానుకోవాలని ఆమె చెప్పారు. వీలైనంత వరకు మోహలను దూరంగా ఉంచుకోవాలని కూడా చెప్పారు. అలాగే కరోనా ప్రభావం దృష్ట్యా.. పరిమితులతో శృంగారంలో పాల్గొనడం మంచిదని సలహా ఇచ్చారు. దీంతోపాటు కొత్తవారితో శృంగారం చాలా ప్రమాదమని పేర్కొన్నారు.