డేవిడ్ వార్న‌ర్‌ స‌వాల్.. ఖుషీ అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్..!

-

మ‌రోసారి త‌న స‌ర‌దాతో ఇన్‌స్టా ద్వారా ‌ముందుకొచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్. తాజాగా త‌న అభిమానుల‌కు ఒక‌ స‌వాల్ విసిరాడు. ‘నేను చెప్పిన డైలాగ్ ఏ హీరోదో.. ఎవ‌రి వేషంలో ఉన్నానో చెప్పాలి. నేను బెట్ వేయ‌గ‌ల‌ను. మీరు చెప్ప‌లేర‌ని’ అంటూ పేర్కొన్నాడు. అయితే వీడియోలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబును ఇమిటేట్ చేస్తూ.. ఇండ‌స్ట్రీ హిట్ పోకిరి సినిమాలో మ‌హేష్ గెట‌ఫ్‌ను దించేశాడు. అయితే కేవ‌లం ఫేస్ మార్ఫింగ్‌ను మాత్ర‌మే చేసిన వార్న‌ర్‌ డైలాగ్‌ను మ్యూట్ చేశాడు.

దీంతో మహేశ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మహేశ్ బాబు అంటే వార్న‌ర్‌కు ఎన‌లేనంత అభిమానం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే డేవిడ్‌ వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన విషయం తెలిసిందే. అది కూడా టాలీవుడ్ సాంగ్స్‌ కు చిందేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news