కోలుకున్న ప్రధాని భార్య…కృతఙ్ఞతలు

-

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోరీ కరోనా మహమ్మారి నుంచి బయటపడినట్లు తెలుస్తుంది. 16 రోజుల చికిత్స తరువాత ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఒక వేడుక కోసం అని మార్చి 12 న ఆమె లండన్ లోని ఒక కార్యక్రమానికి హాజరై వచ్చిన తరువాత ఫ్లూ లక్షణాలు ఉండడం తో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. భార్యకు కరోనా సోకడం తో భార్య తో పాటు ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం స్వీయ క్వారంటైన్ కి వెళుతున్నానని, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనితో క్వారంటైన్ కేంద్రం కి తీసుకువెళ్లడం తో ఆమెకు తగిన చికిత్స అందించడం తో ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు హోం క్వారంటైన్ కు పరిమితం అయ్యారు. ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్య కోలుకున్న సందర్భంగా ప్రధాని ట్రూడో తన సిబ్బంది, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె కోలుకున్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోఫీ.. ప్రస్తుతం నా ఆరోగ్యం బావుంది. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెబుతున్నా. వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని.. మనందరం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు కూడా.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మందికి ఈ కరోనా మహమ్మారి సోకగా,వారిలో దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. భారతదేశంలో కూడా ఈ కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోజురోజుకూ ఈ కరోనా కేసులు పెరిగిపోతుండటం తో ప్రపంచదేశాలు అన్నీకూడా లాక్ డౌన్ ను ప్రకటించడం తో ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news