గుడ్ న్యూస్ : ఏపీలో గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వూలు రద్దు

-

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ..కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 సహా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వూలను మినహాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకూ సంబంధించి ఉద్యోగాల ఎంపికలో ఇకపై ఇంటర్వూలు ఉండబోవని స్పష్టం చేసింది జగన్‌ ప్రభుత్వం. పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకత కోసమే ఎంపిక ప్రక్రియలో ఇంటర్వూలను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఏపీ సర్కార్‌.

ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. దీనిపై స్పందించిన అభ్యర్థులు… ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఇంటర్వ్యూలు లేకుండా ఎలా ఎంపిక చేస్తారని కొంత మంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news