ఏపీ విషయంలో తెలంగాణ మంత్రి చెప్పింది కరెక్టేనా!

-

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ నీటి యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. లేదు నిబంధనలకు లోబడే ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ఏపీ చెబుతోంది. అయితే ఈ నీటి యుద్ధం జరుగుతుండగానే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీ కడుతున్న జగనన్న కాలనీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరు ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు కట్టారో ప్రజలకు బాగా తెలుసు. కానీ కట్టినంతవరకు ఇళ్ళు మంచిగానే కట్టారు. ఇక ఇటు ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం కూడా టిడ్కో ఇళ్ల పేరిట పేదలకు మంచిగానే ఇళ్ళు కట్టించారు. అయితే ఇందులో ప్రభుత్వ పథకంతో ప్రజల సొమ్ము కూడా కొంత ఉంది.

జగన్ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల పరిస్తితి ఏమైందో అందరికీ  తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం తామే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి, గ్రామాల్లో ఉన్న పేదలకు సెంటున్నర భూమి, పట్టణాల్లో ఉన్న పేదలకు సెంటు భూమి ఇచ్చారు. అయితే ఈ స్థలాల్లో ఎంత ఇల్లు కట్టుకోవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా చిన్న ఇల్లు ఈ స్థలాల్లో కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

అదే విషయాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. ఏదో ఒక రూమ్ కట్టేసి, ఇదే ఇల్లు అని జగన్ పభుత్వం చెబుతుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చెప్పాలంటే సెంటు, సెంటున్నర స్థలంలో ఇల్లు పెద్దగా కట్టుకోవడానికి ఏమి రాదు. పైగా జగనన్న కాలనీలు పేరిట ఇళ్ళు కడుతున్నారు. కేంద్రం ఇచ్చే స్కీమ్ లక్షన్నరకు, ఏపీ ప్రభుత్వం మరో రూ.30 వేలు ఇచ్చి, మొత్తం లక్షా 80 వేలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్నారు. ఇక ఈ లక్షా 80 వేలు గానీ, సెంటు భూమి గానీ ఇల్లు కట్టుకోవడానికి ఏ మాత్రం సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలి. పైగా సొంతంగా స్థలాలు ఉన్నవారికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news