అమరావతి: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. పోటీ పరీక్షల్లో ఇంటర్యూలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఏపీపీఎస్సీ పరీక్షలో సాధించిన మార్కులతో పాటు ఇంటర్వ్యూ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశారు. దీంతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అనర్హులయ్యే వారు. ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీపీఎ స్సీ పోటీ పరీక్షల్లో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండవు. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు కూడా ఇంటర్య్యూలు ఎత్తివేశారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీలో ఇక నుంచి ఇంటర్య్వూలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకతకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తామని పేర్కొంది.