ఆర్మీ కంటోన్మెంట్ కు కేటీఆర్ వార్నింగ్…. ఊరుకునేది లేదు, ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం: కేటీఆర్

-

మేమేదో ప్రత్యేక దేశం అనుకుంటున్నారు కంటోన్మెంట్ వాళ్లు. తెలంగాణ దేశంలో భాగం కాదన్నా రీతిలో వ్యవహరిస్తున్నారని… హైదరాబాద్ లో ఉంటున్నామని, కలిసి మెలిసి ఉండాలని ఆర్మీ కంటోన్మెంట్ కు వార్నింగ్ ఇచ్చారు పురపాలక మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆయన కంటోన్మెంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇష్టం వచ్చినట్లు రోడ్లు మూసేస్తాం… నాలాలపై కట్టలు కడుతాం అంటే చూస్తూ ఊరుకోం అని అన్నారు. ఊరుకునేది లేదని.. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం అన్నారు. బుల్కాపూర్ నాలాపై చెక్ డ్యాం నిర్మించి నీటిని అడ్డుకుంటున్నారని..దీంతో దాని పరివాహక ప్రాంతం మునిగిపోతుందని ఆయన అన్నారు. కంటోన్మెంట్ వాళ్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలని.. మాకు ఇష్టం వచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం, కట్టలు కడుతాం అంటే కుదరదని ఆయన అన్నారు. మేము ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని కరెంట్ , మంచినీళ్లు బంద్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. స్పెషల్ ఛీప్ సెక్రటరీని మాట్లాడాలని ఆదేశించారు. వినకుంటే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం అని అన్నారు. వాళ్లు వినకుంటే తీవ్రమైన, కఠిన చర్యలకు వెనకాడకూడదని ఆదేశాలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news