టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు..!

-

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలని అంటూ అయ్యన్నపాత్రుడు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టకపోతే కమిషనర్‌ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడి మాటలకు మనస్తాపం చెందిన కమిషనర్‌… పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news