తెలంగాణ జాగృతి శ్రేణులు హైదరాబాద్ లోని అరవింద్ ఇంటిపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఇంటి ఆవరణలోని పూల మొక్కలు, కారు, ఇంట్లోని ఫర్నిచర్, దేవుడి పటాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇంట్లో అరవింద్ తల్లి ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. నిజామాబాదులో దిశ సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడి విషయం తెలుసుకున్న అరవింద్, కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది కుల అహంకారంతో జరిగిన దాడిగా వర్ణించారు.
అయితే ఈ దాడిలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు బంజారాహిల్స్ పోలీస్ లు. మొత్తంగా 8 మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదైన వారిలో టిఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.