బ్రేకింగ్‌ : సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు…

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ మంగ్లీకి ఊహించని షాక్‌ తగిలింది. సింగర్ మంగ్లీపై రాచకొండ సిపికి ఫిర్యాదు అందింది. సింగర్‌ మంగ్లీ పై కేసు నమోదు చేయాలని రాచకొండ సిపికి ఫిర్యాదు చేసారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్‌ మంగ్లీపై ఆరోపణలు ఉండగా.. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి ఆ పాటని తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

మంగ్లీ పాడిన పాట కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పేర్కొన్నారు. కాగా… జులై 11న మంగ్లీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఈ ఏడాది బోనాల సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ”చెట్టు కింద కూసున్నవమ్మా… సుట్టం లెక్క ఓ మైసమ్మా” అంటూ సాగే ఈ పాట హైదరాబాద్‌ బోనాల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రామస్వామి అందించిన లిరిక్స్‌ పై మంగ్లీ ఆడిపాడగా.. రాకేష్‌ వెంకటాపురం మ్యూజిక్‌ అందించారు. ఓ వైపు ఈ పాట యూట్యూబ్‌ లో దుమ్ములేపేస్తుండగా.. మరోవైపు ఆ పాటలో కొన్ని పదాల పట్ల తెలంగాణకు చెందిన పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దుమారం లేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగ్లీపై ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు.