Hyderabad : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితులు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇవాళ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఉమాశంకర్‌రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయినందున మిగిలిన నిందితులను తొలుత కోర్టులో హాజరుపరచలేదు. అతడు వచ్చేవరకు విచారణను సీబీఐ కోర్టు కాసేపు వాయిదా వేసింది.

ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.  నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ ఇప్పటికే కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన  దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news