దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ పిటిషన్ వేశారు. సీఎం హోదాలో అధికారిక పర్యటనకు వెళుతున్నానని తెలిపారు. జగన్ కు అనుమతి ఇవ్వవద్దని విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని సిబిఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. మే 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్ కు పర్మిషన్ ఇచ్చింది.
అయితే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ లో(స్విజర్లాండ్) పర్యటించనున్నారు. మే 22వ తేదీన దావోస్ కు వెళ్లనున్న సీఎం జగన్ అక్కడ జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొంటారు. దావోస్ పర్యటన లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో సుమారు 35 గ్లోబల్ కంపెనీలు..ఎంఎన్ సీలు, ప్రపంచ స్థాయి నాయకులు, మేధావులతో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి చర్చలు జరపనున్నట్లు సమాచారం.