మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి గత కొద్దీ రోజుల క్రితం బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ విషయం పై సిబిఐ కోర్ట్ లో పలు మార్లు విచారణ జరిగింది మరియు వైఎస్ భాస్కర రెడ్డి తరపు అదే విధమునఁగా సునీత తరపున లాయర్లు తమ వాదనలు వినిపించారు. అయితే సిబిఐ కోర్ట్ ఈ పిటీషన్ ను ఆమోదించకపోగా తాజాగా కొట్టి వేసింది. దీనితో ఆయనకు సిబిఐ కోర్ట్ లో చుక్కెదురైంది. ఈమధ్యనే మొ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలును తెలంగాణ హై కోర్ట్ జరీ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను పెట్టుకున్నారు.కానీ సిబిఐ కోర్ట్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ను ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మధ్యనే భాస్కర్ రెడ్డి ఆరోగ్యం కూడా బాగాలేనందున తర్వాత ఈయన తరపు లాయర్లు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ : వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్ట్ లో చుక్కెదురు… పిటీషన్ కొట్టివేత !
-