సీబీఐలో కొనసాగుతున్న వివాదం కారణంగా న్యూఢిల్లీలోని సతర్కత భవన్‌లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ హజరయ్యారు. సుప్రీం ఆదేశాల ప్రకారం… సీవీసీ విచారణ చేసింది. అలోక్‌వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా ఆరోపణల నేపథ్యంలో సీవీసీ పశ్నించింది. సివిసి కమిషనర్ కెవి చౌదరి, విజిలెన్స్ కమీషనర్లు శరద్ కుమార్, టిఎం బిసాని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎకె పట్నాయిక్ నేతృత్వంలో విచారణ సాగింది. సుమారు 45 నిమిషాల పాటు అలోక్ వర్మను ప్రశ్నించారు. శనివారం సుప్రీంకోర్టుకు తన నివేదికను అందచేసింది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.