యూత్ ఆడియెన్స్ మైమరచిపోయేలాంటి సాంగ్స్ ఇచ్చి.. మ్యూజిక్ డైరక్టరక్షన్ లో రాక్ స్టార్ గా మారిన దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య శ్రోతలను అలరించే ట్యూన్స్ ఇవ్వడంలో వెనుకపడ్డాడు. కమర్షియల్ మ్యుజిషియన్ గా మారిన డిఎస్పి తనలోని క్రియేటివిటీ చూపించడం లేదు అన్నది ఈమధ్య బాగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు దేవి సినిమా అంటే అదో మార్క్ లా ఉండేది కాని ఈమధ్య ఆశించిన స్థాయిలో దేవి ఆకట్టుకోవడంలేదని అనిపిస్తుంది.
ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ వినయ విధేయ రామ టీజర్ ను కూడా దేవి తేలగొట్టాడని కామెంట్స్ వస్తున్నాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాల బిజిఎం నే వివిఆర్ కు వాడేశాడని అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తమన్ మీద కాపీ అలిగేషన్స్ చేస్తుండేవారు. మీరు ఎన్ననుకున్నా నాదారి ఇదే.. దర్శక నిర్మాతలు అడిగిందే నేను ఇస్తున్నా అని తమన్ అంటున్నాడు.
మరి దేవి శ్రీ ప్రసాద్ కు ఏమైందో ఏమో కాపీ ట్యూన్స్ తో లాగించేస్తున్నాడు. సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ట్రెండ్ సృష్టించిన డిఎస్పి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కొందరు అతని అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. చరణ్ టీజర్ గురించి మాత్రం డిఎస్పిని ట్రోల్ చేస్తూ అతన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.