కడప జిల్లా పులివెందులలో సీబీఐ దర్యాప్తు బృందం పని మొదలు పెట్టింది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన నేటి నుంచి సీబీఐ బృందం విచారణ చేపట్టనుంది. నేటి విచారణకు పలువురు కీలక వ్యక్తులను పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో సీబీఐ తన తండ్రి కేసును పట్టించుకోవడం లేదంటూ ఆయన కుమార్తె ఢిల్లీ సీబీఐ అధికారులను కలిసి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే సీబీఐ మళ్ళీ పని మొదలు పెట్టిందని అంటున్నారు. నిజానికి ఈ కేసులో సీబీఐకి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. నిజానికి గతంలోనే రెండు మూడు సార్లు ఈ కేసు ఫైల్స్ తమకు ఇప్పించాల్సిందిగా కోర్టును కూడా ఆస్రయించింది సీబీఐ. అయినా సరే ఈ కేసులో ఏపీ సర్కార్ సహకారం లేకుండా పోతోంది. చూడాలి మరి ఏమవుతుందో ?