ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ!

-

అంతర్గత కుమ్ములాటల కారణంగా… జనరల్ కన్సెంట్ ని వెనక్కి తీసుకున్న ఏపీ

ఏపీలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు (సీబీఐ)కు నోఎంట్రీ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇందుకుగాను జనరల్ కన్సెంట్ని వెనక్కితీసుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు జనరల్‌ కన్సెంట్‌ తెలపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోనే సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలని చట్టంలో ఉంది. దీంతో గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. ఏపీలో సీబీఐ పాత్రను రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది. రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయడానికి అధికారాలున్నాయి..  కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజకీయం చేయాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, అంతకు అంత బదులు చెబుతామని కేంద్రానికి ఓ గట్టి హెచ్చరిక పంపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా అని ఏది చేస్తే అది నడుస్తది అనుకోవడం పొరపాటు అంటూ తెదేపా ఈ కన్సెంట్ ని వెనక్కి తీసుకోవడంతో కేంద్రానికి తేల్చిచెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news