జగన్ కు కోర్టులో ఎదురుదెబ్బ.. శిక్ష పడాలని వైసీపీ వాళ్లు వెయిటింగ్ అట..!

-

ఏపీ సీఎం జగన్ కు తాజాగా సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ ఆయన పెట్టుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. రావాల్సిందే అని కచ్చితంగా చెప్పేసింది. దీంతో టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. తమ విమర్శలకు పదును పెడుతున్నారు.

ఈ అంశంపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డికి మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడటం ఖాయం అన్నారు. ఆయనకు శిక్ష ఎప్పుడు పడుతుందా అని వైసీపీ నాయకులు ఎదురుచూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అయ్యేందుకు ప్రజాధనం ఎలా ఖర్చుపెడతారని ప్రశ్నించారు.

జగన్ తన కేసులకు సంబంధించి తన సొంత డబ్బును ఖర్చుపెట్టి కోర్టులకు హాజరు కావాలన్నారు. మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… చట్టం ముందు అంతా సమానమే అన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఇక ఈ తీర్పుతోనైనా జగన్ రాజీనామా చేయాలన్నారు. అయితే దీనికి తాము పట్టుబట్టబోమని.. ఆయన విచక్షణే వదిలేస్తామని అన్నారు.

మొత్తానికి జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురు కావడం వైసీపీని డిఫెన్సులో పడేసింది. అయితే కేవలం కోర్టు పిటీషన్ ను మాత్రమే కొట్టేసిందని .. దీనికి ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. ఈ మాత్రం దానికే టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని చురకలు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news