మోడిని పొగిడిన చంద్రబాబు…!

-

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. విపక్షాలు కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజిని సమర్ధిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… కేంద్రం చర్యను సమర్ధించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిని స్వాగతించారు.

కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో అల్పాదాయ వర్గాలకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీకి రెండు పేజీల లేఖను రాశారు. లేఖలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్‌కి ఇన్సూరెన్స్ ప్రకటించినందుకు మోదీకి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని,

సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేసారు. ఇదిలా ఉంటే మోడీ సర్కార్ 1,70 వేల కోట్లతో కరోనా ప్యాకేజిని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్… రైతులు, మహిళలు వృద్ధులకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news