ప్రేమికుల దినోత్సవ కానుక జీ తెలుగు స్పెషల్ షో ఓ రెండు ప్రేమ మేఘాలు

-

హైదరాబాద్, 09 ఫిబ్రవరి 2023: ప్రేమ కథలు, ప్రేమికుల కవ్వింపులు, నవ్వింపులతో ప్రేమికుల దినోత్సవానికి ముందే ప్రేమ కబుర్లు పంచేందుకు ఓ రెండు ప్రేమ మేఘాలు స్పెషల్ షోతో వచ్చేస్తుంది మీ జీ తెలుగు. హీరోయిన్ శ్రేయా సరన్తో సహా పలువురు రీల్, రియల్ ప్రేమ జంటలు తమ ప్రేమ కథలను పంచుకుని జ్ఞాపకాల్లో మునిగిపోయారు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ప్రేమికుల దినోత్సవానికి ముందే ఈ ప్రేమ కానుకతో రానుంది. ఫిబ్రవరి 12న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు వేదికగా ప్రసారమవనున్న ఓ రెండు ప్రేమ మేఘాలు ఇదివరకెన్నడూ లేని విధంగా ఆనందంతోపాటు ఆహ్లాదాన్ని అందించబోతోంది.

తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించే ఆన్స్క్రీన్ ప్రేమ కథలకు భిన్నంగా అసలు సిసలైన ప్రేమ కథలతో అభిమాన నటీనటులందరూ ఒకే వేదికపై ప్రేక్షకులకు వినోదంతోపాటు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను కూడా పంచుకోనున్నారు. సీరియల్ ప్రేమ జంటలు అర్జున్ -‌‌ సుహాసిని, నిఖిల్ -‌‌ సుప్రీత, రాజీవ్ – అంజనా అద్భుతమైన ప్రదర్శనతో ఓ రెండు ప్రేమ మేఘాలు వేడుకను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీప్తి -గోకుల్, ఆకర్ష్- ————–లిఖిత, శిశిర్ -‌‌—- నిసర్గ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంటారు.

ఏదిఏమైనప్పటికీ వెండితెర బ్యూటీ శ్రేయా సరన్ తన భర్త ఆండ్రీ కొస్చీవ్తో కలిసి చేసే సందడి షోకి హైలెట్గా నిలుస్తుంది. ఓ రెండు ప్రేమ మేఘాలు వేదికపై మొదటిసారిగా శ్రేయా తన ప్రేమ కథని పంచుకుంది. అంతేకాదు ఇద్దరూ కలిసి ఆడిపాడి ప్రేక్షకులను అలరించనున్నారు. 2022 బ్లాక్బస్టర్ సినిమా పుష్పలోని సాంగ్ ప్రదర్శనతో దివి‌‌- సన్నీ కార్యక్రమాన్ని మరింత అందంగా మలిచారు. ఇవే కాదు, మీకు నచ్చిన, మీరు మెచ్చిన మరెందరో నటీనటులు ఆడుతూ పాడుతూ తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు మీ ముందుకు రానున్నారు.

తమ కామెడీ టైమింగ్, టాంలెంట్తో టెలివిజన్కామెడీ స్టార్స్గా ప్రేక్షకులను అలరిస్తున్న ఆకర్ష్, రోహిణి సందడితో కార్యక్రమం మరింత ఉల్లాసంగా సాగుతుంది. యాదమ్మ రాజు, స్టెల్లా తమ ప్రేమ, కెమిస్ట్రీ కలయికతో వరస పంచులు వేస్తూ నవ్వులు పూయించడమే కాకుండా తమ ప్రేమ కబుర్లు పంచుకుని అందరినీ అలరించారు. వీటన్నింటికీ హైలెట్గా తమ ప్రేమ బంధం గురించి గోమతి చెప్పిన మాటలు అందరి మనసులను హత్తుకుంటాయి. నూకరాజు తన ప్రేమకథను పంచుకుంటూ ఉద్వేగానికి లోనవడం, సర్ప్రైజింగ్గా ఆసియా వేదికపైకి రావడంతో నూకరాజుతోపాటు అందరి మొహాల్లోనూ ఆశ్చర్యంతోపాటు ఆనందం విల్లివిరుస్తుంది. అనుబంధాలు, అనురాగాల ఆత్మీయ కలబోతగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఓ రెండు ప్రేమ మేఘాలు.

ఫిబ్రవరి 12 సాయంత్రం 6 గంటలకు ప్రసారమవనున్న ఓ రెండు ప్రేమ మేఘాలు కార్యక్రమంతో ప్రేమికుల దినోత్సవానికి ముందే ప్రేమ పండుగ చేసుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news